ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీటెక్ పూర్తై రెండేళ్లు.. ఉద్యోగం రాలేదని యువకుడు బలవన్మరణం - కర్నూలులో యువకుడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ పూర్తై రెండు సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ఘాతుకానికి పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

young man makes suicide for not getting job in kurnool district
ఉద్యోగం లేదని యువకుడు ఆత్మహత్య

By

Published : Jun 22, 2020, 12:23 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న లక్ష్మీ నారాయణ కుమారుడు రవితేజ... ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బీటెక్ పూర్తై రెండు సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో చాలా కాలం బాధ పడ్డాడని రవితేజ కుటుంబీకులు చెప్పారు. ఆ ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details