ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతన్నల కష్టాలు చూశాడు.. కలుపు యంత్రం తయారు చేశాడు! - కలుపు యంత్రం వార్తలు

రైతుల కష్టాలను చూశాడు ఆ యువకుడు. తాను చేసే పనికి.. కాస్త ఆలోచన తోడు చేశాడు. అన్నదాతలకు ఆసరాగా ఉండేందుకు.. ఓ యంత్రాన్ని తయారు చేశాడు. అన్నదాతల కష్టాలు దృష్టిలో పెట్టుకుని కలుపు యంత్నాన్ని తయారుచేశారు డోన్​కు చెందిన యువకుడు గురు మోహన్ ఆచారి. పెరిగిన కాడెద్దుల బాడుగ, కూలీలను తగ్గించేందుకు తన ప్రతిభకు సానబెట్టాడు.

young man made weed machine

By

Published : Oct 20, 2019, 9:36 AM IST

కలుపు యంత్రం తయారు చేసిన డోన్ శాస్త్రవేత్త

కర్నూలు జిల్లా డోన్​కు చెందిన గురుమోహన ఆచారి వృత్తి రీత్యా వడ్రంగి. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని నెల రోజులు కష్టపడి కలుపు యంత్రాన్ని తయారు చేశాడు. కోయంబత్తూరులో కొన్ని పరికరాలు తెచ్చాడు. బేరింగ్​లు, పుల్లీలు, బెల్టులు తెచ్చి బిగించాడు. ఇనుప చక్రాలు, గొర్రు, బాడి సొంతంగా తయారుచేసి వీటిపైన ఇంజిన్ కూర్చోబెట్టాడు. మొత్తం ఖర్చు 30 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయలు అయ్యిందని ఆచారి తెలిపాడు. మామిడి, మిరప, పంటలలో కలుపు తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. 2 లీటర్ల డీజిల్​తో ఒక ఎకరం పొలం దున్నొచ్చు.

అదే.. ఎకరం పొలం దున్నాలంటే ట్రాక్టర్​కు 800 రూపాయలు, కలుపు తీయాలంటే కూలీలకు 1000 రూపాయలు అవుతుంది. ఈ యంత్రం వల్ల తక్కువ ఖర్చుతో కలుపు తీసుకోవచ్చు. రోడ్డుపైన వెళ్ళేటప్పుడు టైర్లతో, పొలంలో అయితే ఇనుప చక్రాలను బిగించవచ్చు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు ఉపయోగపడేలా... మరిన్ని తయారు చేస్తానని చెబుతున్నాడు గురు మోహన్ చారి.

ఇదీ చదవండి:మత్తులో ముంచి.. ఏకాంత దృశ్యాలు చిత్రీకరించి..

ABOUT THE AUTHOR

...view details