కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన బోయ శివ(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామ యువతితో శివకు వారం క్రితం పెళ్లి జరిగింది. ఆ విహహం చేసుకోవటం అతనికి ఇష్టం లేదని.. ఆ కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు.
ఇష్టం లేని పెళ్లి కారణంగా యువకుడి ఆత్మహత్య - munagala latest news
ఇష్టం లేని పెళ్లి యువకుడి మరణానికి కారణమైంది. వివాహం జరిగిన వారం రోజులకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆత్మహత్య