కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మంజు తల్లిదండ్రులు మందలించారని ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం మంజు తల్లిదండ్రులు ఆమెను పొలం వెళ్లమని చెప్పారు. ఆమె వెళ్లలేనని చెప్పటంతో.. వారు మంజును మందలించారు.
మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.