కర్నూలు జిల్లా నందవరం మండలంలోని మిట్టసోమాపురంలో బొజ్జప్ప(29) అనే రైతు విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండున్నర లక్షలు అప్పు చేసి.. అర ఎకరం సొంత పొలంతో పాటు, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. అధిక వర్షాల కారణంగా పంట నష్టపోవడంతో దిగులుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషగుళికలు మింగి యువరైతు ఆత్మహత్య - రైతు బలవన్మరణాలు
అప్పు చేసి పొలం సాగు చేశాడో యువ రైతు. కుండపోత వర్షాలు పంటను ముంచాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో అతనికి పాలుపోలేదు. విషగుళికలు మింగి ప్రాణం తీసుకున్నాడు. భార్యపిల్లలకు కొండంత శోకాన్ని మిగిల్చాడు.
విషగుళికలు మింగి యువరైతు ఆత్మహత్య