కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అహోబిలం సమీపంలో నల్లమలలో ఎర్రచందనం దాచి ఉంచారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గాలింపు నిర్వహించారు. పోలీసులకు ముళ్ల పొదల్లో దాచి ఉంచిన ఎర్రచందనం కనిపించింది. మొద్దులను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీటి విలువ రూ.8 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.
నల్లమలలో ఎర్రచందనం... 20 దుంగల స్వాధీనం - kurnool
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.
ఎర్రచందనం