ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాభై ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదు : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

దేశంలో ఎక్కడ చూసినా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చిస్తాయి. గతంలో కల్పించిన పలు సౌకర్యాలు ప్రస్తుతానికి సరిపోవడం లేదు. 20 వేల మందికి నిర్మించిన తాగునీటి పథకం లక్షా ఇరవై వేలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ పరిస్థితిని అధిగమించడానికి ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు.

By

Published : Oct 3, 2020, 3:22 PM IST

water tank bhumi pooja
భూమి పూజ

రూ. 148 కోట్లతో నిర్మించనున్న శాశ్వత తాగునీటి పథకానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కర్నూలులోని ఎమ్మిగనూరు పట్టణంలో ప్రస్తుతానికున్న నీటి ట్యాంక్ 20 వేల మందికి మాత్రమే సరిపోతుందని ఆయన తెలిపారు. జనాభా లక్షా ఇరవై వేలకు చేరడంతో పలు కాలనీల్లో నీటి సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.

పట్టణంలో పెరిగిన జానాభాకు సరిపడా తాగునీరు అందించలేక పోతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే.. మరో యాభై ఏళ్ల వరకు నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details