బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ లను, డైరెక్టర్లను నియమించడంపై కర్నూలులో వైకాపా ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీఎం జగన్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా వాసులకు బెస్త, వీరశైవ లింగాయత్, వాల్మీకి, కుర్ణీ కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు రావడం సంతోషంగా ఉందని కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు అన్నారు.