రహదారి అధ్వానంగా తయారైందని మాట్లాడుకుంటున్న ఇద్దరిపై వైపాకా కార్యకర్తలు ఎమ్మెల్యే ఎదుటే దాడి చేసిన సంఘటన గురువారం కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని కల్లుబావి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ బి.రవి తిమ్మారెడ్డి బస్టాండు వద్ద ఓ పూల వ్యాపారితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో రోడ్డు మీదుగా ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి వాహనం వెళ్తోంది. ఆలూరు రహదారి అధ్వానంగా మారిందనీ, ఎమ్మెల్యే వాహనం ఆ మార్గంలో ఇరుక్కుంటే జనం బాధ తెలుస్తుందనీ మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్న వైకాపా కార్యకర్త వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫొటోలు తీసి వెళ్లిపోయాడు.
రోడ్డు బాగా లేదన్నందుకు ఇద్దరిపై వైకాపా నాయకులు దాడి - ycp leaders attack on two persons in adoni kurnool
రోడ్డు బాగా లేదన్నందుకు ఇద్దరు వ్యక్తులపై వైకాపా నాయకులు దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఒకటో పట్టణ ఎస్సై రమేష్ తెలిపారు.
కొద్దిసేపటికి ఓ వాహనంలో ఆరుగురు వచ్చి తమనిద్దరినీ శిల్పాసౌభాగ్యనగర్ వద్దకు ఎత్తుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టారని, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఇంటికి సైతం తీసుకెళ్లి, ఆయన ఎదుటే దాడి చేశారని రవి వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశంతో తమను వదిలేశారన్నారు. రవి ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేరగా, పూలవ్యాపారి ఎటో వెళ్లిపోయారు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఒకటో పట్టణ ఎస్సై రమేష్ తెలిపారు. దాడి బాధ్యులను అరెస్టు చేయాలంటూ సీపీఎం, తెదేపా నాయకులు రాస్తారోకో చేపట్టారు.
ఇవీ చదవండి