తెదేపా కార్యకర్త మాభాషాపై అదే వార్డుకు చెందిన వైకాపా నాయకులు దాడి చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల 34వ వార్డు వీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. అతని బంధువులతో ఓటు విషయం మాట్లాడుతుండగా.. అధికార పార్టీ నేతలు వచ్చి దాడి చేశారని బాధితుడు వాపోయాడు. సిమెంట్ ఇటుకతో కొట్టడంతో తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు.. మూడో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నంద్యాలలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి - తెదేపా నేతపై నంద్యాల 34వ వార్డులో ఇటుకతో వైకాపా కార్యకర్తల దాడి
కర్నూలు జిల్లా నంద్యాల 34వ వార్డులో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతలు దాడి చేయగా.. తలకు గాయాలయ్యాయి. బంధువులతో ఓటు విషయం మాట్లాడుతుండగా.. ఇటుకతో కొట్టినట్లు బాధితుడు తెలిపాడు.
![నంద్యాలలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి ycp men attacked on tdp leader at nandyala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10945942-63-10945942-1615358413854.jpg)
నంద్యాలలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
నంద్యాలలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
ఇదీ చదవండి: