కర్నూలు జిల్లా ఆదోనిలో భాజపా కార్యకర్త కేశవ్పై దాడి జరిగింది. వైకాపా నాయకుడు హులిగప్పే తనపై దాడి చేసి గాయపరిచినట్టు బాధితుడు ఆరోపించాడు. ఇంటి పట్టా మంజూరు చేసే విధంగా చూడాలని హుళిగప్పను కోరగా.. భాజపా కార్యకర్తలకు పట్టా రాదంటూ దాడి చేశాడని చెప్పాడు. కేశవ్ ఆదోని ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఇందిరమ్మ గృహాలున్న వారికి పట్టా మంజూరు చేసి.. భాజపా కార్యకర్తనన్న వంకతోనే తనకు ఇల్లు రాదని చెప్పడం విడ్డూరమని అతను వాపోయాడు.
భాజపా కార్యకర్తపై దాడి.. వైకాపా నేతపై ఆరోపణలు - ఆదోని వైకాపా నేత దాడిలో గాయపడ్డ భాజపా కార్యకర్త
ఇంటి పట్టా మంజూరు కోసం సహకరించాలని కోరినందుకు.. వైకాపా నాయకుడు తనపై దుర్భాషలాడి, దాడి చేశాడంటూ భాజపా నేత ఆరోపించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

చికిత్సపొందుతున్న బాధితుడు