కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్లు కేటాయించడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..బీసీలకు ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.
కర్నూలులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులు కేటాయించినందుకు కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కర్నూలులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం