ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెడ్ కానిస్టేబుల్​పై వైకాపా కార్యకర్తల దాడి - kurnool district crime news

మాస్క్ పెట్టుకోమన్నందుకు ముగ్గురు వైకాపా కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు మహానంది పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్​కానిస్టేబుల్ ఆరోపించారు. ఈ మేరకు వారిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ycp activists attack on head constable in kurnool district
ycp activists attack on head constable in kurnool district
author img

By

Published : Aug 30, 2020, 4:38 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం మసీదుపురానికి చెందిన ముగ్గురు వైకాపా కార్యకర్తలు తనపై దాడి చేశారని హెడ్ ​కానిస్టేబుల్ ప్రసాద్... స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో పీర్ల పండగ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా విధులు నిర్వహించడానికి వెళ్లిన తనపై వారు చేయి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్రామానికి చెందిన లోకేశ్ రెడ్డిని మాస్క్ ధరించాలని తాను సూచించానని... దీనికి అతను దుర్భాషలాడి మరో ఇద్దరితో కలిసి తనపై దాడి చేశారని ప్రసాద్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details