ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు - పత్తికొండ వార్తలు

కర్నూలు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎమ్మెల్యే శ్రీదేవి వాహనాన్ని అడ్డుకున్నారు. ఇసుక కొరత కారణంగా తమకు ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చిన తర్వాత ఆందోళనను విరమించారు.

Workers block MLA Sridevi's vehicle
ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు

By

Published : Jul 8, 2021, 7:38 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెరలో గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీదేవి వాహనాన్ని భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. రెండున్నరేళ్లుగా ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని.. గుంతకల్ ప్రధాన రహదారిలో స్థానిక విద్యుత్తు కేంద్రం ముందు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

ఇసుక కొరత కారణంగా తమకు ఉపాధి లేక భార్య పిల్లలను పోషించుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని కార్మికులు వాపోయారు. జాయింట్ కలెక్టర్​తో మాట్లాడి వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details