కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని గని గ్రామంలో గత ప్రభుత్వంలో చేపట్టి పూర్తయిన పనులనే తిరిగి చేపట్టి బిల్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగ శేషులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం ద్వారా పొలాలకు వెళ్లే రహదారి పనులు చేపట్టారని గుర్తు చేశారు.
గతంలో గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లే రహదారులను దాదాపు 30 లక్షల రూాయలతో గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేశారు. బిల్లుల కోసం సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. అవి రాక ముందే అవే పనులపై గ్రావెల్ వేసి కొందరు బిల్లులు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.