తాగునీటి కోసం కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పట్టణ శివారు కాలనీల్లోని మహిళలు నిరసన తెలిపారు. పట్టణంలోని చాలా కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని... కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీ, అమరావతి నగర్, నిజాముద్దీన్ కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించట్లేదని మహిళలు వాపోయారు. ట్యాంకర్ల ద్వారా సరిపడా నీటిని అందించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన - protest in adoni kurnool
తాగునీటి సమస్యను తీర్చాలని కర్నూలు జిల్లా ఆదోనిలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. శివారు కాలనీల్లో నీటి సమస్య అధికంగా ఉందని తెలిపారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించట్లేదని.. ట్యాంకర్ల ద్వారా సరిపడా నీటిని అందించాలని మహిళలు డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్యను తీర్చాలని ఖాళీ బిందెలతో ఆందోళన..