కర్నూలులోని శరీన్ నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జోస్న, జగన్మోహన్రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచే ఆమెను.. భర్త వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి భర్తే కారణమని.. అందువల్లే అతను పరారీలో ఉన్నాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమన్న బంధువులు - karnulu latest news
కర్నూలులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి భర్త వేధింపులే కారణమని.. మహిళ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమన్న బంధువులు women suicide in karnulu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11818746-278-11818746-1621424772386.jpg)
women suicide in karnulu