కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పెద్దనేలటూరులో చెందిన అడివమ్మతో సూరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సూరీకి కొంతకాలంగా భార్యపై అనుమానం ఉండటంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో అడివమ్మను దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘాతుకం చేసిన వెంటనే నిందింతుడు సూరి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త! - కర్నూలు జిల్లా క్రైం
కర్నూలు జిల్లా పెద్దనేలటూరులో విషాదం జరిగింది. కట్టుకున్న భర్తే అనుమానంతో భార్యను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త