కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. ఇంటి పక్కన పొట్టేళ్లు పెంచే ఇనుప రేకుల షెడ్డుకు విద్యుత్ సరఫరా అయింది.
ఆ షెడ్డులో శుభ్రం చేస్తున్న లక్ష్మిదేవికి షాక్ కొట్టడంతో... అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మహిళను కాపాడపోయిన మనోహర్ అనే వ్యక్తి గాయపడగా అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.