కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం జరిగింది. ఎద్దు పొడిచి ఈరమ్మ(55) అనే మహిళ మృతి చెందింది. ఎద్దులు రెండు పొట్లాడుకుంటూ ఒకటి పరిగెత్తుతూ ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్న మహిళను కొమ్ములతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపాలిటీలో పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మిగనూరులో విషాదం.. ఎద్దు పొడిచి మహిళ మృతి - ఎద్దు పొడిచిన మహళ మృతి కర్నూలు
ఎద్దు పొడిచి మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.
ఎద్దు పొడిచి మహిళ మృతి