కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎస్. నాగలాపురం సమీపంలో ఆటో బోల్తా పడి సరోజ(40) అనే మహిళ మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో ఎస్.నాగలాపురం నుంచి ఎమ్మిగనూరుకు వెళ్తుండగా.. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో బోల్తా పడింది. గ్రామీణ ఎసై రామసుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా.. మహిళ మృతి - women died in road accident at nagalapuram
ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎస్. నాగలాపురం సమీపంలో జరిగింది.

ఎస్ నాగాలాపురంలో ఆటో బోల్తా