ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనత్తను కడసారి చూసేందుకు.. వచ్చి మృతిచెందింది - నంద్యాలలో కాలు జారి కిందపడి మహిళా మృతి వార్తలు

మృతి చెందిన బంధువును కడసారి చూసేందుకు వచ్చింది. అంత్యక్రియలు చేసేందుకు బంధువులందరూ వెళ్లారు. అపార్ట్​మెంట్​లో రెండో అంతస్తు నుంచి దిగేందుకు లిఫ్ట్​ వద్దకు వచ్చి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.

మేనత్తను కడసారి చూసేందుకు.. వచ్చి మృతిచెందింది
మేనత్తను కడసారి చూసేందుకు.. వచ్చి మృతిచెందింది

By

Published : Oct 21, 2020, 11:27 AM IST

జిల్లాలో గడివేములకు చెందిన పార్వతమ్మ(65) నునేపల్లెలో అపార్ట్​మెంట్​లో ఉన్న తన మేనత్త అచ్చమ్మ మృతి చెందడంతో కడసారి చూసేందుకు వచ్చింది. అచ్చమ్మ భౌతిక కాయాన్ని అంతక్రియలు చేసేందుకు బంధువులు వెళ్లారు. ఇంట్లోనే ఉన్న పార్వతమ్మ రెండో అంతస్తు నుంచి దిగేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో కాలు జారి కిందపడింది. తీవ్ర గాయాలైన పార్వతమ్మను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details