కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామానికి చెందిన లత కాన్పు కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. గురువారం మధ్యాహ్నం ఆమె మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కాన్పు అయిన కొద్ది సేపటికే పుట్టిన కుమారుడితో పాటు తల్లి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని మృతురాలి తల్లి గొవిందమ్మ ఆరోపించారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు లో తల్లి, శిశువు మృతి.. బంధువుల ఆందోళన - kurnool latest updates
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతి చెందారని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతురాలి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏడుస్తున్న మృతురాలి బంధువులు