ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పు తీర్చలేదని మహిళ నిర్బంధం - కర్నూలులో అప్పు తీర్చలేదని మహిళ నిర్భందం

అప్పు చెల్లించడంలో జాప్యం చేసిన ఓ మహిళను ఇంటికి పిలిచి నిర్బంధించిన ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో జరిగింది. రూ.5 లక్షలు అప్పుకుగాను రూ. 8 లక్షలు ఇవ్వాలని ప్రామిసరీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు.

Woman restrained from paying debt in karnool district
అప్పు తీర్చలేదని మహిళ నిర్భందం

By

Published : Dec 4, 2019, 3:27 PM IST

అప్పు తీర్చలేదని మహిళ నిర్భందం

అప్పు చెల్లించడంలో జాప్యం చేసిన ఓ మహిళను ఇంటికి పిలిచి నిర్బంధించిన ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో జరిగింది. నంద్యాల విస్వాసపురానికి చెందిన విజయకుమారి అనే మహిళ తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకొంది. డబ్బులు ఇవ్వాలని వెంకటేశ్వర్లు ఒత్తిడి చేయడంతో విజయకుమారి ఇంటికి వెళ్ళింది. అక్కడ కొంతమంది వ్యక్తులు తోడై డబ్బులు ఇచ్చే దాక బయటకు వదిలేది లేదంటూ గదిలో నిర్బంధించారు. రూ.8 లక్షలు అప్పు ఉన్నట్లు ఖాళీ ప్రామిసరీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

nirbhadam

ABOUT THE AUTHOR

...view details