కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం జరిగింది. తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని వివాహిత ఫిర్యాదు చేసింది. వెలుగోడులోని జమ్మినగర్ తండాకు చెందిన నాగమ్మబాయి, నాగేష్ నాయక్ భార్యాభర్తలు. భర్త గాలేరు బ్రిడ్జి వద్ద వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. రాత్రి భర్తకు తోడుగా భార్య గాలేరు బ్రిడ్జి వద్ద ఉండగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అనంతరం దాడి చేశారని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వెలుగోడులో దారుణం..మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం - crime news in velugodu kurnool
వాచ్మెన్గా పని చేసున్న భర్తకు తోడుగా వెళ్లిన మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై దాడి చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా వెలుగోడులో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News