కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఓ మహిళ బైఠాయించి ఆందోళన చేపట్టింది. తనతో ఓ అధికారి అసభ్యకరంగా మాట్లాడాడని వాపోయింది. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్న లక్ష్మీ భాయ్ ఉద్యోగం కోసం కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లింది. నాన్ లోకల్ కావడంతో ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. అక్కడే ఉన్న శ్రీనివాసులు అనే అధికారి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన మహిళకు అధికారి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు మహిళ ధర్నా - Woman protest in Kurnool లాైే
ఓ అధికారి తనతో అసభ్యంగా మాట్లాడాడని ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసింది. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.
కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు మహిళ ధర్నా