కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మమ్మ హత్యకు గురైంది. ఇంట్లో మంచంపై మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు... కొడవలితో నాగలక్ష్మమ్మ తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను హతమార్చినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులే హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి నలుగురు కుమారులు కాగా, ఆమె చిన్న కుమారుడు వద్ద ఉంటోంది.
కొడవలితో దాడి... మహిళ దారుణ హత్య - kurnool district crime
కర్నూలు జిల్లా బి.కోడూరు గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కొడవలితో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![కొడవలితో దాడి... మహిళ దారుణ హత్య woman murdered in b.koduru kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11885979-549-11885979-1621883378842.jpg)
మహిళ దారుణ హత్య