కర్నూలు జిల్లా నంద్యాల వీసీ కాలనీకి చెందిన జయలక్ష్మి అనే మహిళకు కొన్నేళ్లక్రితం మహానంది మండలం గాజులపల్లెకు చెందిన సంజీవ రాయుడుతో వివాహం జరిగింది. వారి మధ్య మనస్పర్థలు రావటంతో కొంతకాలంగా ఎవరికి వారు వేరగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నంద్యాల సంజీవనగర్ గేట్ పెట్రోల్ బంకులో పనిచేసి జీవిస్తున్న జయలక్ష్మి మహానంది మండలం యు.బొల్లవరానికి చెందిన ప్రసాద్‌తో సహజీవనం చేస్తోంది. వీరికి మనస్పర్థలు రావటంతో తరుచూ ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఈ నెల 14న పెట్రోలు బంకులో ఉన్న జయలక్ష్మిపై ప్రసాద్ కర్రతో దాడి చేశారు. దీంతో తలకు బలమైన గాయం కావటంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు.