Murder: కర్నూలు జిల్లా కోసిగిలో ఆస్తి కోసం ఓ మహిళను.. కుటుంబసభ్యులే హత్య చేశారు. నాగేష్, రాజు అనే ఇద్దరు వ్యక్తులు.. తమ చిన్నమ్మ నరసమ్మను వేట కొడవళ్లతో శనివారం రాత్రి దారుణంగా నరికారు. బొంతుల నరసమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
దారుణం.. ఆస్తి కోసం చిన్నమ్మపై కొడవళ్లతో దాడి - కర్నూలులో సొంత చిన్నమ్మ హత్య
Murder: ఆస్తుల కోసం ఈ రోజుల్లో సొంతవాళ్లే ఎంతటికైనా తెగిస్తున్నారు. క్షణికావేశాల్లో ప్రాణాలు సైతం తీస్తున్న ఘటనలు తరుచు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే.. కర్నూలు జిల్లా కోసగిలో జరిగింది. సొంత బాబాయి భార్యనే(వరసకు చిన్నమ్మ) కొడవళ్లతో దాడి చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆస్తి విషయంపై సొంత బావ(భర్త అన్న) కుమారులు బొంతుల నరసమ్మపై శనివారం రాత్రి ఇంట్లో గొడవ పడి నరసమ్మపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితురాలి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు కోసిగిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే గొడవకు కారణమని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: