ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాజీ ప్రియుడిని చంపిన యువతి - ఏపీ తాజా వార్తలు

Woman Kills Ex Boyfriend With New Lover Help : మానవ సంబంధాలకు విలువ లేకుండాపోతోంది. కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను ప్రియురాలు చంపేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

lover murder ex lover
lover murder ex lover

By

Published : Jan 16, 2023, 1:56 PM IST

Woman Kills Ex Boyfriend With New Lover Help : తెలంగాణలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ యువతి.. తన కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. మాజీ ప్రియుడు రవికుమార్‌ను యువతీయువకులు రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details