కర్నూలు పట్టణంలో దేవ నగర్ కు చెందిన లక్ష్మీ దేవి అనే మహిళ... అనారోగ్యంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరింది. రెడ్ జోన్ లో ఉన్న ప్రాంతం కారణంగా.. వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్లిన ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. తిరిగి ఆస్పత్రికి తీసుకువెళ్లేలేపు మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే లక్ష్మీదేవి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
సమయానికి సరైన వైద్యం అందక మహిళ మృతి - కర్నూలులో మహిళ మృతి వార్తలు
సరైన వైద్యం అందక లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. నీరసంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ప్రథమ చికిత్స చేసి వైద్యులు ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన ఆమె కళ్లు తిరిగి పడిపోగా మరోసారి ఆస్పత్రికి తిరిగి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందింది.

Woman die