కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పట్టణ శివారు బైపాస్ రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బేబీ అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మహిళకు గాయాలు కాగా.....చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదం చేసి.....గాయాలైన మహిళను ఆసుపత్రిలో చేర్పించకుండానే అలాగే వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
accident: ఆదోనిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - ఆదోని
ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి