కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అదనపు కట్నం కోసం తమ కుమార్తెను అత్తింటివారే హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సి బెళగల్ మండలం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన కురువ సుజాతను మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామానికి చెందిన కురువ లక్ష్మన్నకు ఇచ్చిమూడు నెలల క్రితం వివాహం చేశారు. అప్పట్లో కొంత నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తమ కుమార్తెను ఆమె భర్త, అత్త మామలు వేధించేవారని సుజాత తల్లిదండ్రులు తెలిపారు. సుజాతను కొట్టి పురుగుల మందు తాగించి చంపారని... అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. సుజాత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లైన నాలుగు నెలలకే... అత్తింటి వారే కారణమా? - kurnool district crime news
పెళ్లయిన నాలుగు నెలలకే నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అదనపు కట్నం కోసం తమ బిడ్డను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతి