కర్నూలు జిల్లా ఓబుళాపురం తండాకు చెందిన బాలిబాయ్ (45) నాలుగు రోజుల క్రితం ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆరోగ్యశ్రీ నుంచి అనుమతి వచ్చే వరకు ఆసుపత్రి యాజమాన్యం చికిత్స చేయలేదని ఆమె బంధువులు తెలిపారు. అందువల్లే బాలిబాయ్ మృతి చెందిందని వారి కుటుంబ సభ్యులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
కర్నూలులో మహిళ మృతి... ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన - kurnool latest news
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందంటూ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో మహిళ మృతి... ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన