కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళా కానిస్టేబుల్ ధర్నాకు దిగారు. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఉసేనమ్మ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ఆత్మకూరు సీఐ గుణశేఖర్ లైంగికంగా వేధించాడని ఈనెల 15న జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు విచారణలో ఉండగా సీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఉసేనమ్మ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. సీఐ నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.