ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అత్తింటి వారు వేధిస్తున్నారు... న్యాయం చేయండి' - అత్తింటి వారు వేధిస్తున్నారని కర్నూలులో మహిళ ఫిర్యాదు

తన భర్త, అత్తింటి వారు వేధిస్తున్నారని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

మాట్లాడుతున్న బాధితురాలు
మాట్లాడుతున్న బాధితురాలు

By

Published : Mar 24, 2021, 5:36 PM IST

మాట్లాడుతున్న బాధితురాలు

అత్తింట్లో వేధింపులు ఎక్కువయ్యాయని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజశేఖర్​తో తనకు 2019లో వివాహం జరిగిందని బాధితులు సాబీరారాణి తెలిపారు.

వివాహం అయిన కొన్ని రోజుల నుంచి తనను భర్త, వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని వాపోయింది. పంచాయితీ చేసి తన భర్త నుంచి వేరు చేశారని బాధితురాలు వెల్లడించింది. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని బాధితురాలు తెలిపింది. తన భర్తతో కలిసి ఉండే విధంగా న్యాయం చేయాలని వేడుకుంది.

ABOUT THE AUTHOR

...view details