అప్పుల బాధతో తాళలేక కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన బీరవోలు రామంజమ్మ అనే మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వడ్డీ వ్యాపారం చేస్తున్న దూరపు బంధువుల దగ్గర అధిక వడ్డీకి రెండు లక్షల రూపాయలు అప్పు చేసింది. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో అసలు, వడ్డీ కలిపి పది లక్షల రూపాయలు దాటింది. అప్పు తీర్చవా అంటూ వ్యాపారులు ఆమెను అవమానించారు.. మనస్థాపంతో మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య - బనగానపల్లెలో మహిళ ఆత్మహత్య
తీసుకున్నది రెండు లక్షల అప్పు... అసలు, వడ్డీ కలిపి ఆ అప్పు 10 లక్షలు దాటింది. తీర్చలేని అప్పుతో పాటు వ్యాపారుల అవమానం తట్టుకోలేకపోయిందా మహిళ. మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Woman committing suicide due to debt at Banaganapalle in Kurnool District