ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. భర్తను రోకలితో కొట్టి చంపిన భార్య - ap news time

వేధింపులు భరించలేక భర్తను గొడ్డలితో నరికి చంపిందో భార్య. అనంతపురంలో జరిగిన ఈ దారుణం మరవక ముందే కర్నూలు జిల్లాలో మరో ఘటన జరిగింది. మహబూబ్​ బీ అనే మహిళ తన భర్తను రోకలితో తలపై కొట్టి హత్య చేసింది.

రోకలితో భర్తను కొట్టి చంపిన భార్య

By

Published : Aug 30, 2019, 5:35 PM IST

భార్య చేతిలో భర్త హతం..!
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో దారుణం జరిగింది. నిత్యం పెట్టే బాధలు భరించలేక భర్తను.. భార్య హత్య చేసింది. మహబూబ్​ బాషా, మహబూబ్​ బీ ఇద్దరూ దంపతులు. వారి మధ్య వివాదం చెలరేగటంతో మహబూబ్​ బాషాను.. మహబూబ్​ బీ రోకలితో తలపై మోది చంపింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details