కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం క్రిష్టిపాడులో దారుణం జరిగింది. వృద్ధాప్యంలో అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు చిన్న కారణాలతో గొడవ పెట్టుకున్నారు. అది ముదిరి భర్తే.. భార్యను హత్యచేశాడు.
గ్రామానికి చెందిన ఎలిసా, భాగ్యమ్మ భార్యాభర్తలు. అతని వయసు 70 ఏళ్లు కాగా, ఆమెకు 62 సంవత్సరాలు. ఏమైందో తెలియదు కానీ మంగళవారం ఎలిసా తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. అది తీవ్రరూపం దాల్చటంతో ఆవేశంలో కత్తితో భార్యపై దాడిచేసి పోరిపోయాడు. ఈఘటనలో భాగ్యమ్మ మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.