Wife Killed Husband With Her Lover In Kurnool:కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఆల్వాలకు చెందిన ఆమోస్ హత్య కేసులో అతడి భార్య అరుణతోపాటు ఆమె ప్రియుడు సూర్యప్రదీప్, జీవన్‌కుమార్‌లను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆమోస్, అరుణలు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవటంతో సూర్యప్రదీప్ అనే వ్యక్తితో అరుణ పరిచయం పెంచుకుంది. ఆమోస్ అడ్డు తొలగిస్తే... పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో అరుణ చెప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో సూర్యప్రదీప్, తన స్నేహితుడు జీవన్‌కుమార్‌తో కలిసి ఆమోస్‌ను ఇనుప రాడ్డు, రాయితో కొట్టి హత్య చేసినట్లు, తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు.
కర్నూలులో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - కర్నూలులో ప్రేమికుడి సాయంతో భర్తను హతమార్చిన భార్య
Wife Killed Husband With Her Lover In Kurnool: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో సెక్యూరిటీ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంతలో ఆమెకు ఓ అపరిచిత వ్యకితో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది...అక్రమ సంబంధంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్యచేసిన ఘటన కర్నూలులో చేటుచేసుకుంది.
murder