ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య - ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య న్యూస్

తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిందో ఇల్లాలు. ఈ ఘటన కర్నూలు జిల్లా గాజులపల్లెలో జరిగింది. గ్రామానికి చెంది చాకలి నాగరాజు ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోస్టుమార్టం నివేదికలో నాగరాజును గొంతు నులిమి హత్యచేసినట్లు తేలిందీ . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నేరస్తులను గుర్తించారు.

wife killed
wife killed

By

Published : Mar 23, 2021, 8:49 AM IST

కర్నూలు జిల్లా గాజులపల్లెలో ఈనెల 18న మృతి చెందిన నాగరాజు హత్యకు గురయినట్లు పోలీసులు నిర్దారించారు. అతడి భార్య ప్రియుడి సాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చాకలి నాగరాజు (35) ఈనెల 18వ తేదీన తెల్లవారుఝామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సోమవారం నంద్యాల గ్రామీణ సీఐ మల్లికార్జున, ఏఎస్‌ఐ వెంకటసుబ్బయ్యలు వెల్లడించారు.

పోస్టుమార్టం నివేదికలో నాగరాజును గొంతు నులిమి హత్యచేసినటు తేలిందని దీంతో మృతుని భార్య కళావతి, ఆమె ప్రియుడు బండిఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటకు చెందిన వెంకటనరసింహులు అలియాస్‌ నరసింహాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు ఓంకారంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమం అద్దాల మండపం పరిసరాల్లో ఉండగా అదుపులోకి తీసుకొని విచారించినట్లు చెప్పారు. భర్తను హత్యచేయడంలో ఆమె ప్రియుడు సహకరించడంతో.. అతడితో పాటు అతను ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు సీఐ మల్లికార్జున వెల్లడించారు.

ఇదీ చదవండి:నియోజకవర్గానికి ఒక వాహనం..వెటర్నరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details