ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త వేధింపులపై మహిళా సంఘలకు భార్య ఫిర్యాదు

అతను ఒక పోలీసు... భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయినా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. చేస్తున్నది తప్పు అని భార్య ఎంత చెప్పినా ఫలించలేదు. తన భార్యను చట్టరీత్య దూరం చేసుకోవాలని విడాకుల నోటీసు పంపాడు. ఫలితంగా బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది. న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యింది. ఈ ఘటన కర్నూలులో జరిగింది.

wife-complained-to-womens-associations
మహిళా సంఘలకు భార్య ఫిర్యాదు

By

Published : Dec 24, 2020, 6:41 PM IST

భర్త వేధింపుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఓ మహిళ మహిళా సంఘలను ఆశ్రయించింది. ఈ ఘటన కర్నూలులో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తనకు 2001లో మధుసూదన్​తో వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలు తెలిపింది. మధుసూదన్ దిశా పోలీసు స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడని, అతను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని రాధ ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా అతనిలో మార్పరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు కోరుతూ తనకు నోటీసులు పంపి వేదిస్తున్నాడని తెలిపారు. భర్తపై కేసు నమోదు చేసి, న్యాయం చేయాలని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details