కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నంలో భార్యభర్త ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఎడమకంటి వీర హుస్సేన్ రెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడారు. ఈ విషయం తెలుసుకున్న వీర హుస్సేన్ రెడ్డి తల్లి వెంకట లక్ష్మమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది . ప్రసుత్తం ఆమె బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
స్థల వివాదంపై పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ... దంపతుల బలవన్మరణం... - కర్నూలు తాజా వార్తలు
కర్నూలు జిల్లా సంగపట్నంలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. స్థల వివాదంలో పోలీసులు బెదిరింపులకు గురి చేయటం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
![స్థల వివాదంపై పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ... దంపతుల బలవన్మరణం... wife and husband suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9919547-791-9919547-1608281741928.jpg)
ఉరివేసుకొని దంపతుల బలవన్మరణం
స్థలం కొనుగోలు విషయంలో అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తితో వీర హుస్సేన్‌కు వివాదం నడుస్తోంది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అవుకు ఎస్సై సెలవుల్లో ఉండటంతో.. బనగానపల్లి సీఐ సురేష్ కుమార్‌రెడ్డి పంచాయితీ చేసినట్లు డీఎస్పీ నరసింహారెడ్డి వివరించారు.
ఉరివేసుకొని దంపతుల బలవన్మరణం
ఇదీ చదవండి:కర్నూలులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు