ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుళ్ళ బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కర్నూలు ఎస్పీ కోర్టులో పిటిషన్ వేశారు. నిందితులకు ఇవాళ బెయిల్ రావడంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంటనే బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి . ఆందోళనలు ఉద్దృతం చేసేందుకు సిద్దమయ్యాయి.
ఈ పరిస్ధితుల్లో స్పందించిన సీఎం జగన్ పరిస్ధితులపై చర్చించారు. నిందితులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్టు అయినప్పటికీ బెయిల్ ఎలా వచ్చిందని సీఎం ఆరా తీశారు.వెంటనే సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ వెంటనే రద్దయ్యేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.. దీంతో వెంటనే చర్యలకు ఉపక్రమించిన అధికారులు న్యాయ స్థానంలో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇద్దరు నిందితులను నేరుగా వేలెత్తి చూపుతున్నారని పిటిషన్ లో ఎస్పీ తెలిపారు.