రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు: మంత్రి బుగ్గన - minister buggan rajendranath reddy
అవినీతితో నిండిపోయిన రెవిన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అసలైన యజమానులకే భూమి హక్కులు కల్పిస్తామని వెల్లడించారు.
రెవిన్యూ వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అవినీతిని రూపుమాపుతామని స్పష్టం చేశారు. త్వరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రూ. కోటి 23 లక్షలతో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, గ్రంథాలయ భవనాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సభలో బుగ్గన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవటమే కరెంట్ కోతలకు కారణమన్నారు. త్వరలో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ నిరుద్యోగులకు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు కల్పించారన్నారు.