ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత - latest news of srisailam project

శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటికుండను తలపిస్తోంది. కాగా... జలాశయం పది గేట్లను ఎత్తి 3,38,348 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

water releasing with srisailam project ten gates
శ్రీశైలం జలాశయానికి భారీ వరద

By

Published : Sep 22, 2020, 7:42 PM IST

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. ఫలితంగా ప్రాజెక్టు పదిగేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు, నీటినిల్వ 212.4385 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 26,741 క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details