ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల - karnulu latest news

రాష్ట్రంలో తుఫాను దాటికి కురిసిన వర్షానికి.. కడప జిల్లాలోని వెలిగల్లు జలాశయంలోకి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్.. నీటిపారుదల అధికారులతో కలిసి జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు.

water realease
వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల

By

Published : Jun 7, 2021, 9:35 PM IST

తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు.. పరివాహక ప్రాంతాల్లో నుంచి వచ్చిన వరద నీటితో కర్నూలులోని వెలిగల్లు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతాల నుంచి వర్షపు నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి పారుదల అధికారులు, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్​తో కలిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దులో నిర్మించిన జెర్రి కోన ప్రాజెక్టు నిండి అలుగు పడుతోంది. దిగువన ఉన్న బాహుదా నది నీటి పరవళ్లతో కళకళలాడుతోంది. రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి మండలం పింఛా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకుంది. ప్రాజెక్టులో నీరున్నా పొలాలు తడవని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి:వారసత్వ భూమి కోసం.. ఇంటి వద్ద కుటుంబ సమేతంగా రైతు దీక్ష!

ABOUT THE AUTHOR

...view details