శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి 5 లక్షల 203 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 5 లక్షల 50 వేల 149 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 4 లక్షల 62 వేల 573 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 37 వేల 6 వందల 30 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211.51 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 55 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్ కు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఎడమ జల విద్యుత్ కేంద్రంలో 14.700 మిలియన్ యూనిట్లు, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో 14.116 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.