ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,04,279 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. వరద పెరగడంతో జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,95,881 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 58,897 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
srisailam dam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల - శ్రీశైలం జలాశయం తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,04,279 క్యూసెక్కులుగా కొనసాగుతోంది
శ్రీశైలం జలాశయం ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల
Last Updated : Sep 17, 2021, 10:31 AM IST