వర్షం కోసం రైతులు గ్రామ దేవతలకు విశేష పూజలు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా చినుకు జాడ లేక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శ్రావణమాస వేడుకలను నిర్వహిస్తూ వర్షం కురిపించాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర శుక్రవారం గ్రామ దేవతలు మద్దమ్మ బండారం యువకులు ఉపవాస దీక్షతో 101 బిందెల నీటితో జలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవార్లకు బోనాల ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
వర్షం కోసం గ్రామాదేవతలకు జలాభిషేకం - పత్తికొండ
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర రైతులు వర్షం కోసం గ్రామ ప్రజలందరు కలిసి పూజలు చేశారు.ఉపవాస దీక్షతో 101 బిందెల నీటితో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు.
జలాభిషేకం